మహువా మెయిత్రాపై వేటు.. లోక్‌సభ నుంచి బహిష్కరణ

8 Dec, 2023 15:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో తృణమూళ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మహువా మెయిత్రాపై వేటు పడింది. లోక్‌ సభ నుంచి ఆమెను బహిష్కరించినట్లు లోక్‌ సభ స్పీకర్‌ ఓంబిర్లా ప్రకటించారు. ఎంపీ మహువా మొయిత్రా ప్రవర్తన అనైతికమని, అసభ్యకరంగా ఉందని ఎథిక్స్‌కమిటీ చేసిన తీర్మానాలను లోక్‌ సభ అంగీకరిస్తుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ఎంపీగా కొనసాగడం తగదని.. ఆమెను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు లోక్‌ సభ స్పీకర్‌ పేర్కొన్నారు.

ఇక, టీఎంసీ ఎంపీగా మహువా మోయిత్రాను బహిష్కరించాలని లోక్‌సభ తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేసి పార్లమెంట్‌ బయటకు వచ్చారు.

ప్రతిపక్షాలను కూల్చే ఆయుధం
లోక్‌సభలో ఎంపీగా బహిష్కరణకు గురైన టీఎంసీ నాయకురాలు మహువా మెయిత్రా ఎథిక్స్‌ కమిటీపై విమర్శలు గుప్పించారు. ఎథిక్స్‌ కమిటీ నివేదిక సరైంది కాదని అన్నారు. ఎథిక్స్‌ కమిటీ ప్రతిపక్షాన్ని కూల్చడానికి ఒక ఆయూధంగా మారిందని మండిపడ్డారు. ఎథిక్స్‌ కమిటీ నియమ, నిబంధనలు అన్నీ ఉల్లంఘించి నివేదిక సమర్చిందని దుయ్యబట్టారు.

చదవండి: ఎంపీ మహువాపై లోక్‌సభ నిర్ణయం అదేనా..!

>
మరిన్ని వార్తలు