సీఎం కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయి: డిప్యూటీ సీఎం మౌర్య

30 Jun, 2022 17:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ భారీ మెజార్టీ సాధిస్తుందని ఉత్తరప్రదేశ్‌ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయి. తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్‌ దేశ రాజకీయాలకంటే తెలంగాణ పాలనపై దృష్టి పెడితే బాగుంటుంది. మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు పెడితే పేద, బలహీన వర్గాలు క్షమించవు. మహారాష్ట్రలో అనైతిక పొత్తుపెట్టుకున్న ఉద్ధవ్‌ను ప్రజలు వ్యతిరేకించారు. ఉదయ్‌పూర్‌లో టైలర్‌ కన్హయ్యలాల్‌ హత్య సహించరానిది. కాంగ్రెస్‌ దేశ రాజకీయాల్లో అస్థిత్వాన్ని కోల్పోయింది' అని డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్‌ మౌర్య అన్నారు.

చదవండి: (సీతారామన్‌ టంగ్‌ స్లిప్‌: కేటీఆర్‌ కౌంటర్‌, వైరల్‌ వీడియో) 

మరిన్ని వార్తలు