Ayodhya Ram Mandir: అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

29 Jan, 2024 07:00 IST|Sakshi

శ్రీరాముడు జగదానందకారకుడు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కొలువైన రామ్‌లల్లా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. ఆలయ గర్భగుడిలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన జరిగి వారం రోజులు దాటినా భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. రామ్‌లల్లాను తనివితీరా దర్శించాలనే కోరిక అయోధ్యకు వచ్చే ప్రతీ ఒక్కరిలోనూ కనిపిస్తోంది.

తీవ్రమైన చలి గజగజా వణికిస్తున్నా భక్తులు రామ్‌లల్లా దర్శనం కోసం బారులు తీరుతున్నారు. పిల్లలు, పెద్దలు, ముఖ్యంగా యువత శ్రీరాముని దర్శించుకునేందుకు అమితమైన ఆసక్తి కనబరుస్తోంది. అయోధ్యకు వచ్చే  భక్తుల కోసం పలు సేవా సంస్థలు వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. 

రామ్‌పథ్‌ తదితర మార్గాల నుంచి వస్తున్న భక్తుల కోసం  ఉచిత భోజనశాలలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రామ్‌లల్లా సందర్శకుల కోసం  నిర్మించిన టెంట్ సిటీని ప్రారంభించారు. దీనిలో 25 వేల మంది  భక్తులు బస చేసేందుకు అవకాశం ఉంది. ఈ టెంట్‌ సిటీలోనూ ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు.

whatsapp channel

మరిన్ని వార్తలు