గోవా Vs అయోధ్య: హనీమూన్‌ రచ్చ.. చివరికి..?

25 Jan, 2024 14:28 IST|Sakshi

అనివార్య పరిస్థితుల్లోనో  లేదంటే  విభేదాలు, తగాదాలు మితిమీరినా భార్యాభర్తల మధ్య విడాకులకు దారి తీస్తుంది.  అయితే బోపాల్‌లో   ఫ్యామిలీ కోర్టుకు  చేరిన ఓ విడాకులు కేసు ఒకటి విచిత్రంగా నిలిచింది. గోవా, సౌత్ ఇండియా  హనీమూన్‌ ట్రిప్‌కు  తీసుకెళ్లానంటే భార్య ఎగిరి గంతేసింది. తీరా టూర్‌ అయిన తరువాత  తనకు భర్త నుంచి విడాకులు  ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?

ఫ్రీ ప్రెస్ జర్నల్‌లోని ఒక నివేదిక ప్రకారం భోపాల్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. హనీమూన్‌కు  గోవాకు తీసుకెళ్తానని మాట ఇచ్చాడు భర్త. గోవాకి బదులు అయోధ్య, వారణాసికి తీసుకెళ్లాడు అనేది భార్య ఆరోపణ. గోవా, సౌత్ ఇండియా పర్యటనకు భార్య అంగీకరించింది.  అయితే ఆ  తర్వాత భర్త ఆమెకు సమాచారం ఇవ్వకుండానే అయోధ్య, వారణాసికి విమాన టిక్కెట్లు బుక్ చేశాడు. జనవరి 22న జరిగే రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి  తీసుకెళ్లమని తల్లి కోరిన నేపనథ్యంలో ఇలా చేశాడు.

 అయితే ఈ విషయాన్ని దాచి పెట్టి ట్రిప్‌కు ఒకరోజు ముందు  తాము అయోధ్యకు వెళ్తున్నామని  చెప్పాడు.    దీంతో తన కంటే కుటుంబ సభ్యులే ఎక్కువ అంటూ ఆగ్రహించింది.  అయినా  గప్‌చుప్‌గా టూర్ కెళ్లి వచ్చింది.  చివరికి ఈ  కారణంతోనే తనకు విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ దంపతులు ఇద్దరూ హిందూ పుణ్యక్షేత్రాలను సందర్శించి, తిరిగి వచ్చిన 10 రోజుల తరువాత ఈ కేసు  కోర్టుకు చేరింది. ప్రస్తుతం వీరిద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చే పనిలో ఉన్నారు అధికారులు. 
 

whatsapp channel

మరిన్ని వార్తలు