మహా పాలిటిక్స్‌లో ట్విస్ట్‌.. రాజ్‌ థాక్రేతో టచ్‌లో ఏక్‌నాథ్‌ షిండే

27 Jun, 2022 12:18 IST|Sakshi

మహారాష్ట్రలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. పొలిటికల్‌ ఇష్యూ చివరకు సుప్రీంకోర్టును తాకింది. సీఎం ఉద్ధవ్‌ థాక్రే వర్గం, శివసేన తిరుగుబాటు టీమ్‌ ఏక్‌నాథ్‌ షిండే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు.. డిప్యూటీ స్పీకర్ అనర్హతను సవాల్ చేస్తూ షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వారి పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. 

ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర పాలిటిక్స్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేవ(ఎంఎన్‌ఎస్‌) అధినేత రాజ్‌ థాక్రే తెర మీదకు వచ్చారు. సోమవారం ఉదయం రాజ్‌థాక్రేకు ఏక్‌నాథ్‌ షిండే ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో నెలకొన్ని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. శివసేన నేతలు ప్రవర్తిస్తున్న తీరు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి షిండే.. రాజ్ ఠాక్రేను అడిగి తెలుసుకున్నారు. దీంతో వీరి మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. 

ఇది కూడా చదవండి: మీకు రెండే ఆప్షన్స్‌ ఉన్నాయి.. రెబల్స్‌కు ఆధిత్య థాక్రే వార్నింగ్‌

మరిన్ని వార్తలు