స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. ఉవ్వెత్తున ఎగిసిన అగ్ని కీలలు..

6 Aug, 2023 19:12 IST|Sakshi

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. కాస్మారాలో ఉన్న రాయ్‌పూర్ స్టీల్ ప్లాంట్‌ నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఘటనాసమయంలో దాదాపు 100 మంది కార్మికులు ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. కాగా మంటల్లో కాలి ఒక వ్యక్తి మరణించినట్లు సమాచారం.

స్టీల్ ప్లాంట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంటలు వేగంగా వ్యాపించాయి. కాగా.. మంటల్లో కాలి పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. పేలుడుకు సంబంధించిన కారణాలు ఉంకా తెలియలేదు. దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు..

మరిన్ని వార్తలు