ఈ బతుకు మాకొద్దు.. మరణించేందుకు అవకాశమివ్వండి

19 Aug, 2021 07:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లేఖ రాసి కుటుంబం అదృశ్యం 

శివాజీనగర: ఆత్మహత్య లేఖ రాసి ఉంచి కుటుంబం అదృశ్యమైన సంఘటన బెంగళూరు బాగలగుంటలో చోటు చేసుకుంది. గాంధీ, శాలిని దంపతులు, వారి పిల్లలు భానుశ్రీ, హేమశ్రీ అదృశ్యమైనవారు. దంపతుల తనయుడు చిరంజీవి తుమకూరులో చదువుకుంటున్నాడు. రోజూ కుటుంబంతో ఫోన్లో మాట్లాడేవాడు. ఆగస్టు 12న ఫోన్‌ చేయగా అందరి ఫోన్లు స్విచ్చాఫ్‌ అని రావడంతో కంగారుపడిన చిరంజీవి, దగ్గర్లోని స్నేహితునికి సమాచారమిచ్చాడు. అతడు వెళ్లిచూడగా ఇంటికి తాళం వేసి ఉంది.

ఇంటి యజమానిని విచారించగా, కుటుంబంతో కలిసి వస్తువులన్నింటిని తీసుకొని వెళ్లారని చెప్పాడు. ఇది తెలిసి చిరంజీవి బాగలకుంటెకు వచ్చి  తన వద్ద ఉన్న తాళంతో ఇంటి తలుపులు తీయగా, కిటికీ వద్ద డెత్‌నోట్‌ కనిపించింది. తమకు బతకటం చాలా కాష్టమవుతోంది, ఈ జీవితం అవసరం లేదు. దయచేసి మరణించేందుకు అవకాశం ఇవ్వాలని అందులో రాసి ఉంది. చిరంజీవి ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయగా కేసు నమోదు చేసుకుని గాలింపు జరుపుతున్నారు.    
చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా మారిన ‘బుల్లెట్టు బండి’ వధువు

మరిన్ని వార్తలు