ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

29 Nov, 2023 22:40 IST|Sakshi

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌నెట్‌ కేసుకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.

స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పు తరువాత ఫైబర్ నెట్ కేసు విచారిస్తామని ధర్మాసనం గతంలో పేర్కొంది. అయితే గురువారం నాటి జాబితాలో స్కిల్ కేసు తీర్పు అంశం లేదు. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వార్తలు