ఛత్తీస్‌గఢ్‌లో 20 మంది మావోయిస్టులు లొంగుబాటు

10 Dec, 2023 06:34 IST|Sakshi

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత సుక్మా జిల్లాలో శనివారం ఐదుగురు మహిళలు సహా 20 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. వివిధ మావోయిస్టు అనుబంధ విభాగాలకు చెందిన వీరంతా అమానవీయ మైన, పసలేని మావోయిస్టుల సిద్ధాంతాలతో విసిగినట్లు తెలిపారని సుక్మా ఎస్‌పీ కిరణ్‌ చవాన్‌ వెల్లడించారు.

లొంగుబాటపట్టిన వారిలో మిలిషియా డిప్యూటీ కమాండర్‌ ఉయిక లఖ్మా, దండకారణ్య ఆదివాసీ కిసాన్‌ మజ్దూర్‌ సంఘటన్‌(డీఏకేఎంఎస్‌), క్రాంతికారీ మహళా ఆదివాసీ సంఘటన్‌(కేఏఎంఎస్‌), చేతన నాట్య మండలి(సీఎన్‌ఎం)లకు చెందిన సభ్యులున్నార న్నారు. జిల్లాలోని జాగర్‌గుండా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వీరు మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లొంగిపోయిన వారికి పునరావా స కార్యక్రమాలను వర్తింప జేస్తామన్నారు.

>
మరిన్ని వార్తలు