గ్యాంగ్‌స్టర్, మాజీ ఎమ్మెల్యే అన్సారీకి షాక్‌, పదేళ్ల జైలు, భారీ జరిమానా

27 Oct, 2023 17:53 IST|Sakshi

యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్‌ టర్న్‌డ్‌ పొలిటీషియన్‌,మాజీ ఎమ్మెల్యే  ముఖ్తార్ అన్సారీ​కి ఘాజీపూర్ కోర్టు శుక్రవారం పదేళ్ల జైలుశిక్ష, భారీ జరిమానా విధించింది.

Mukhtar Ansari: యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్‌ టర్న్‌డ్‌ పొలిటీషియన్‌,మాజీ ఎమ్మెల్యే  ముఖ్తార్ అన్సారీ మరోసారి భారీ షాక్‌ తగిలింది.  ముఖ్తార్ అన్సారీ హత్య, హత్యాయత్నం కేసుల్లో దోషిగా తేల్చిన ఘాజీపూర్ కోర్టు శుక్రవారం పదేళ్ల జైలుశిక్ష, భారీ జరిమానా విధించింది.

2009 గ్యాంగ్‌స్టర్స్ యాక్ట్ కేసులో అన్సారీని గురువారం ఘాజీపూర్ జిల్లా ప్రత్యేక న్యాయమూర్తి (ఎంపీ-ఎమ్మెల్యే) అరవింద్ మిశ్రా అన్సారీని దోషిగా ప్రకటించారు. బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కోర్టు  శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. అన్సారీ అనుచరుడు,  సోనూ యాదవ్‌ను కూడా దోషి తేల్చింది. సోనుకు 5 సంవత్సరాల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది. అయితే దీనిపై హైకోర్టులో అప్పీలు చేస్తామనీ, తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని ముఖ్తార్ అన్సారీ తరఫు న్యాయవాది లియాఖత్  తెలిపారు.  

2009లో  కపిల్ దేవ్ సింగ్ హత్యకు  కుట్ర పన్నిన ఆరోపణలు  వచ్చాయి. దీంతోపాటు మీర్ హసన్ అనే వ్యక్తిపై దాడికి సంబంధించిన మరో కేసు కూడా ఉంది. ఘాజీపూర్‌లోని కరంద పోలీస్ స్టేషన్‌లో ముఖ్తార్‌పై గ్యాంగ్‌స్టర్ కేసు నమోదైంది. అయితే 2011, 2023లో ఈ రెండు కేసుల్లో అన్సారీని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో అన్సారీకి 1996లో విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) నాయకుడు నందకిషోర్ రుంగ్తా, 2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌ను హత్య చేసిన కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ముఖ్తార్ అన్సారీ మౌ సదర్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు