ట్రెండింగ్‌లో ‘గెట్‌అవుట్‌రవి’.. తమిళనాడు గవర్నర్‌కు వ్యతిరేకంగా నిరసన

10 Jan, 2023 11:12 IST|Sakshi

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల తొలిరోజున సభ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి వాకౌట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగం పాఠాన్ని పలు చోట్ల విస్మరించడంతో వివాదం రాజేసింది. ద్రవిడ దిగ్గజాల పేర్లను ఆయన ప్రస్తావించకపోవడం, తమిళనాడు పేరు మార్చాలని వ్యాఖ్యనించటంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికి వ్యతిరేకంగా చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ‘గెట్‌అవుట్‌రవి’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో గవర్నర్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్‌లో పోస్టులు వెళ్లువెత్తుతున్నాయి. దీంతో గెట్‌అవుట్‌రవి అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. 

చెన్నైలో ట్విట్టర్‌ నంబర్‌ 1 ట్రెండింగ్‌ గెట్‌అవుట్‌రవి అనే పోస్టర్లు వెలిచాయి. పోస్టర్‌పై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, యువజన సంక్షేమ, క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సహా డీఎంకే పార్టీ నేతల ఫోటోలతో పోస్టర్లు ఉన్నాయి. గెట్‌అవుట్‌రవి అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్‌ చేస్తూ ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చిన వారికి డీఎంకే నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్‌ ‘వాకౌట్‌’

మరిన్ని వార్తలు