పదే పదే చెప్పినా పట్టించుకోలేదు.. డీజే సౌండ్‌ మోతకు కొత్త పెళ్లికొడుకు మృతి!

5 Mar, 2023 16:21 IST|Sakshi

ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావించిన ఓ వరుడి కల కలగానే మిగిలిపోయింది. మండపంలో డీజే సౌండ్‌ మోతకు ఆ వరుడి గుండె లయ తప్పి స్టేజిపైనే అక్కడికక్కడే కుప్పుకూలిపోయాడు. పెళ్లి బాజాలు మోగాల్సిన మండపం కాస్త మూగపోయింది. ఈ విషాదకర ఘటన బీహార్‌లోని సీతామర్హి జిల్లా మణితార గ్రామంలో చోటుచేసుకొంది.

ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోలేదు
బీహార్‌లోఘో వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన యువతితో ఇందర్వాలో వివహం జరుగుతోంది. వధూవరులు స్టేజిపైకి వచ్చి దండలు మార్చుకుని, వచ్చిన అతిథులతో ఫోటోలు దిగుతున్నారు. అదే సమయంలో అతడి మిత్రులు డీజే సౌండ్‌ను పెంచి, డ్యాన్స్‌ చేస్తున్నారు. పెళ్లి హంగామా కారణంగా ఆ వాతావరణమంతా సందడి నెలకొంది. అంతా బాగానే నడుస్తుండగా, డీజే తనకు ఇబ్బందిగా ఉందని సౌండ్‌ తగ్గించాలని పదేపదే కోరాడు వరుడు. కానీ, అతని మాటలు ఎవరూ పట్టించుకోలేదు. పాటలు యథావిధిగానే బిగ్గరగా వినిపిస్తూనే ఉన్నాయి.

కొద్ది క్షణాల తర్వాత వరుడు వేదికపైనే హఠాత్తుగా కుప్పకూలిపోగా, కుటుంబ సభ్యులు, అతిథులు వెంటనే అతడిని వైద్య సహాయం కోసం స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ దురదృష్టకర సంఘటన వెనుక పెళ్లి ఊరేగింపులో డీజే సంగీతం ఎక్కువగా వినిపించడమే కారణమని తెలిసింది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణ ప్రారంభించింది. నివేదికల ప్రకారం, శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి సీతామర్హి జిల్లాలో డీజేల వినియోగాన్ని నిషేధించారు. వివాహాలు, ఇతర బహిరంగ కార్యక్రమాల సమయంలో డీజేల వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి హైలైట్ చేసింది.

చదవండి: డ్రైవర్‌ లేకుండానే దానికదే హఠాత్తుగా స్టార్ట్‌ అయిన ట్రాక్టర్‌! ఆ తర్వాత..

మరిన్ని వార్తలు