బుల్లెట్ నడిపిన సీఎం ఖట్టర్

26 Sep, 2023 15:20 IST|Sakshi

చంఢీగర్‌: ఎలాంటి భద్రత లేకుండా బైక్ రైడ్ చేశారు హరియాణా ముఖ్యమంత్రి  మనోహర్‌ లాల్ ఖట్టర్. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై సీఎం ముందు వెళుతుండగా.. భద్రతా సిబ్బంది, అధికారులు ఆయనను అనుసరించారు. కర్నాల్ ఎయిర్‌పోర్టు వరకు బైక్‌ ప్రయాణం చేశారు. 

హరియాణాలో 'కార్‌ ఫ్రీ డే' సందర్భంగా సీఎం బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్‌ను తగ్గించే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. వారంలో ఓ రోజు కార్లను ఉపయోగించకుండా ప్రజలను ప్రోత్సహించే సంకల్పంతో బైక్ రైడ్ నిర్వహించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌(ఎక్స్)  ఖాతాలో తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన కర్నాల్‌లో ఈ ర్యాలీ చేపట్టారు.

ఇదీ చదవండి: బీజేపీ నేతపై లుక్‌అవుట్ నోటీసులు

  

మరిన్ని వార్తలు