కుక్క కాటు.. ఒక్కో పంటి గాటుకు రూ.10వేల పరిహారం!

14 Nov, 2023 17:29 IST|Sakshi

చండీగఢ్‌: కుక్క కాటు కేసులపై హర్యానా-పంజాబ్ హైకోర్టులు సంచలన తీర్పు వెలువరించింది. కుక్క కాటుపై రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన బాధ్యత వహించాలని ధర్మాసనం తెలిపింది. కుక్క కాటు కేసుల్లో ఒక్కో పంటి గాటుకు రూ.10,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. కుక్క కాటు ఘటనల్లో 0.2 సెంటీమీటర్ల కోత పడితే రూ.20,000 బాధితునికి చెల్లించాలని ఆదేశించింది. కుక్క కాటు కేసులో దాఖలైన 193 కేసుల్లో న్యాయస్థానం విచారణ చేపట్టింది. 

వీధికుక్కల బెడదపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 49 ఏళ్ల పరాగ్ దేశాయ్ అక్టోబర్‌లో వీది కుక్కలు వెంబడించిన ఘటనలో మరణించారు. వీధికుక్కలు ఆయన్ని వెంబడించగా పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయిందని.. ఆ కారణంగా దేశాయ్ మరణించారని సంబంధిత ఆసుపత్రి ఇటీవల ప్రకటనలో పేర్కొంది. ఈ విషాద ఘటన అనంతరం సోషల్ మీడియాలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని పెద్ద ఎత్తున చర్చ సాగింది.

పంజాబ్, హర్యానా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో నమోదైన కుక్క కాటు కేసులపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు కోరింది. జంతువుల దాడి కేసుల్లో చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని నిర్ణయించాలని తీర్పులో స్పష్టం చేసింది. అయితే.. వీది కుక్కలతో పాటు ఆవులు, ఎద్దులు, గాడిదలు, గేదెలు, అడవి, పెంపుడు జంతువులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. 

ఇదీ చదవండి: Liquor Sale In Delhi: ‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం!

మరిన్ని వార్తలు