Year Ender 2023: సామాన్యునికి 2023 ఏమిచ్చింది?

24 Dec, 2023 08:18 IST|Sakshi

గడచిన 2020, 2021 సంవత్సరాల్లో కరోనా మహమ్మారి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. దేశవ్యాప్తంగా అమలైన లాక్‌డౌన్, కరోనా ఆంక్షలు సామాన్యుల వెన్ను విరిచాయి. వ్యాపారాలు నిలిచిపోవడంతో చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అయితే 2022లో పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. వ్యాపారాలు తిరిగి ట్రాక్‌లో పడ్డాయి. ఆ దశ దాటాక వచ్చిన 2023  సామాన్యులకు ఉపశమనం  కలిగించింది. 

మాల్స్‌లో జనం బారులు
దేశంలో జీడీపీ వృద్ధి కూడా ఊహించిన దాని కంటే అధికంగానే ఉంది. 2023లో మార్కెట్లలో మంచి ఆర్థికవృద్ధి కనిపించింది. రెస్టారెంట్లు జనాలతో నిండిపోయాయి. మార్కెట్లు, మాల్స్‌లో జనం గుంపులు గుంపులుగా కనిపించారు. ఇది జీడీపీ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను మించి 7.6 శాతంగా నమోదైంది. తయారీ, మైనింగ్, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల అద్భుతమైన పనితీరు కారణంగా రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఊహించిన దాని కంటే అధికంగా ఉంది ఉంది. 

రూ. 200 దాటిన టమాటా
వ్యవసాయం పరంగా కూడా ఈ ఏడాది బాగానే ఫలితాలు వచ్చాయి. బియ్యం, ఇతర ధాన్యాల ఉత్పత్తి వృద్ధి చెందింది. ద్రవ్యోల్బణం విషయానికి వస్తే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తక్కువగానే ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. జూలై-ఆగస్టులో టమాటా ధరలు కిలో రూ.200 దాటాయి. దీంతో ప్రభుత్వం టమాటాను రాయితీ ధరలకు విక్రయించాల్సి వచ్చింది. టమోటా తర్వాత ఉల్లి ధరలు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. అయితే ఇప్పుడు ఉల్లి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. 

తగ్గిన నిరుద్యోగిత రేటు
2023 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు తగ్గింది. కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు తగ్గింది. జూలై-సెప్టెంబర్ 2023లో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 7.2 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.6 శాతంగా ఉంది. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగిత రేటు 6.6 శాతంగా నమోదైంది. అదే సమయంలో మహిళా కార్మికుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. 2023 సంవత్సరం ఉపాధి రంగంలో మిశ్రమ సంవత్సరంగా నిలిచింది.
ఇది కూడా చదవండి: జనం‍ సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే!

>
మరిన్ని వార్తలు