వైఎస్సార్‌ జిల్లాలో సీఎం జగన్‌ రెండో రోజు పర్యటన

24 Dec, 2023 15:05 IST|Sakshi

 Updates

2:54PM,. Dec 24. 2023

వైఎస్సార్‌జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ రెండో రోజు పర్యటన

  • సింహాద్రిపురంలో రోడ్డు వెడల్పు, సుందరీకరణ పనులు
  • వైఎస్సార్‌ పార్క్‌, తహశీల్దార్‌ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం ప్రారంభోత్సవంతో సీఎం జగన్‌

ఇడుపులపాయ నుంచి సింహాద్రిపురం పర్యటనకు సీఎం జగన్‌
ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం
సింహాద్రిపురంలో పోలీసు స్టేషన్, తాహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు సింహాద్రిపురం జంక్షన్, పార్కులను ప్రారంభించనున్న సీఎం
అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్న సీఎం జగన్‌

పులివెందుల మండల నాయకులతో సీఎం జగన్‌ సమావేశం
సమావేశానికి హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ అమర్‌నాథ్‌రెడ్డి, కలెక్టర్‌ విజయరామరాజు, స్థానిక నాయకులు

ఇడుపులపాయలో సీఎం జగన్‌
వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకున్న సీఎం జగన్‌
మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్‌
అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం.

ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్‌ ఘాట్ వద్దకు చేరుకున్న జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు,  జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు,  కడప మేయర్ సురేష్ బాబు, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్,  ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్  హేమచంద్రా రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య సలహాదారు రాజోలి వీరారెడ్డి, తదితరులు  దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు

వైఎస్సార్‌ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా నేడు సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం ఇడుపులపాయ నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు. ఘాట్‌లో జరిగే ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని 11.30 వరకు ప్రార్థనల్లో పాల్గొంటారు.

మధ్యాహ్నం 12.20 గంటలకు సింహాద్రిపురం జూనియర్‌ కళాశాల సమీపాన ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.40 గంటల వరకు సింహాద్రిపురం మండల ప్రజాప్రతినిధులతో మాట్లాడుతారు. అనంతరం సింహాద్రిపురంలోని రోడ్డు వెడల్పు, సుందరీకరణ, వైఎస్సార్‌ పార్క్‌, తహసీల్దార్‌ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌, ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

3 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్‌లో దిగుతారు. ఎకో పార్క్‌ మీటింగ్‌ ప్రదేశానికి చేరుకుంటారు. పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 4.45 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని, ఆ రాత్రి అక్కడే బస చేస్తారు.

>
మరిన్ని వార్తలు