చెన్నై వరద సాయానికి మోదీ ఆమోదం

7 Dec, 2023 18:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మిచౌంగ్‌ తుపాను కారణంగా చోటు చేసుకున్న భారీ వర్షంతో వరదలు​ చెన్నై సిటీని అతలాకుతలం చేశాయి. అక్కడ వరదల్లో చిక్కుకున్న ప్రజలు ఇంకా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై బెసిన్‌ ప్రాజెక్టులో భాగంగా ‘ఇంటిగ్రేటెట్‌ అర్బన్‌ ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌’ కార్యకలాపాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు వరద సహాయ కార్యకలపాలకు అవసరమగు రూ.561.29 కోట్ల నిధులకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

చెన్నై నగరం తరచుగా భారీ వరదలకు గురవుతోంది. గత ఎనిమిదేళ్లలో మూడు భారీ వరదలతో మూడు సార్లు నీట మునిగింది చెన్నై. నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ (NDMF)కింద ప్రధాని మోదీ మొదటిసారి చెన్నై నగరానికి వరద సాయం నిధులను ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం వరదల సాయంగా రూ.500 కోట్లను కలుపుకొని మొత్తం రూ. 561.29కోట్ల నిధులకు ప్రధాని ఆమోదం తెలిపారు. చెన్నై వరదలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం పరిశీలించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ వరదలపై ఏరియల్‌ సర్వే తర్వాత మొదటి విడత వరద సాయంగా రూ. 450 కోట్లు విడుదల చేశారు. మిగతా సాయం రెండో విడతగా విడుదల కానునుంది. 

ఇంకా.. వరదల్లో చిక్కుకున్న చెన్నై ప్రజలు తీవ్రమైన ఇబ్బందలు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్నవారు, వరద కారణగా నిరాశ్రయులేన వారికి ఆహారం, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల సహాయక సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా జారవిడుస్తున్నారు.

ఉత్తర చెన్నైలోని మనాలి ప్రాంతంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. అక్కడి ప్రజలకు తాగునీరు, 12వేల లీటర్ల పాలు, పాల పొడి, దుప్పట్లు, ఆహారం అందించినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన అనకపుత్తూర్‌ను సీఎం ఎంకే స్టాలిన్‌ సందర్శించారు. వరద బాధితులకు ఆహార పొట్లాలు అందజేశారు.

>
మరిన్ని వార్తలు