‘ఇండియా’ భేటీ ప్రారంభం

1 Sep, 2023 05:16 IST|Sakshi

తొలిరోజు సాధారణ సమావేశం  

కూటమి నేతలకు ఉద్ధవ్‌ ఠాక్రే విందు 

నేడు రెండో రోజు కీలక సమావేశం  

ముంబై:  దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే తామంతా చేతులు కలిపామని విపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు స్పష్టం చేశారు. కూటమి సమావేశం గురువారం సాయంత్రం ముంబైలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో ప్రారంభమైంది. కూటమిలోని వివిధ పారీ్టల అగ్రనేతలు హాజరయ్యారు. తొలిరోజు సాధారణ సమావేశమే జరిగింది. రెండో రోజు నాటి అజెండాపై చర్చించారు. అనంతరం కూటమి నాయకులకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్‌) పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే విందు ఇచ్చారు. కీలక సమావేశం శుక్రవారం జరుగనుంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయేను ఓడించడమే ధ్యేయంగా స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు.

మొదటి రోజు భేటీలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్‌ నాయకులు సోనియా గాం«దీ, రాహుల్‌ గాం«దీ, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశి్చమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్, పంజాబ్‌ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్‌ మాన్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్, జమ్మూకశీ్మర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రా్రïÙ్టయ లోక్‌దళ్‌ చీఫ్‌ జయంత్‌ చౌదరి, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ తదితరులు పాల్గొన్నారు. దేశ ఐక్యతను, సార్వభౌమత్వాన్ని వెంటనే బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అభిప్రాయపడ్డారు. దేశ సమస్యలను పరిష్కరించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా సీట్ల పంపకంపై తేల్చాలని ఆప్‌ డిమాండ్‌ చేసినట్లు కేజ్రీవాల్‌ వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు