లక్ష దిగువకు పడిపోయిన కరోనా కొత్త కేసులు.. తగ్గుముఖంతో కేంద్రం ‘వర్క్‌ఫ్రమ్‌ హోం’ ఎత్తివేత

7 Feb, 2022 09:35 IST|Sakshi

Corona New Cases Update: భారత్‌లో మూడో వేవ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడం మొదలైంది. గత ఇరవై నాలుగు గంటల్లో 83, 876 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 


గడిచిన 24 గంటల్లో.. మొత్తం 83, 876 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 11,56,363 మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించగా.. 83 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా మరణాలు 895 చోటు చేసుకున్నాయి. ఒక్కరోజులో 1,99, 054 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జనవరి 6 తర్వాత లక్ష మార్క్‌కు దిగువన కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 

ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 11, 08, 938 కాగా, రోజూవారీ పాజిటివిటీ శాతం 5, 02, 874గా ఉంది. ఇక ఇప్పటివరకు దేశంలో కరోనాతో 5, 02, 874మంది(అధికార గణాంకాల ప్రకారం) చనిపోయారు. మొత్తం రికవరీల సంఖ్య 4,06,60,202గా నమోదు అయ్యింది. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా భారత్‌లో ఇప్పటిదాకా 1,69,63,80,755 డోసులు అందించింది.

వర్క్‌ఫ్రమ్‌ హోం ముగిసింది
కాగా, సోమవారం నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కార్యాలయాలకు పూర్తి హాజరు కావాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యాలయాలు కోవిడ్ ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటించాలని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్క్‌ఫ్రమ్‌ హోం ఇక ముగిసినట్లేనని సింగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఒమిక్రాన్‌ విజృంభణ సమయంలో కేంద్ర ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు