గగన్‌యాన్‌ తొలి ప్రయోగంపై కేంద్రం కీలక ప్రకటన! ఎప్పుడంటే..

14 Sep, 2022 06:50 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం 2024లో ఉంటుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ మంగళవారం వెల్లడించారు. 2022లోనే చేపట్టాల్సిన ఈ ప్రయోగంపై కరోనా ప్రభావం పడిందన్నారు.

రష్యాలో వ్యోమగాముల శిక్షణ కూడా కరోనా వల్లే వాయిదా పడిందన్నారు. ‘‘గగన్‌యాన్‌ మిషన్‌ తొలి ప్రయోగ పరీక్ష ఈ ఏడాది చివర్లో ఉంటుంది. అంతరిక్ష నౌకను 15 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయోగిస్తారు. క్యాప్సూల్‌ను పారాచ్యూట్ల  సాయంతో భూమిపైకి తీసుకొస్తారు.

రెండోసారి అంతరిక్ష నౌకను మరింత ఎత్తుకు తీసుకెళ్తారు’’ అని అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది చేపట్టే మరో యాత్రలో మహిళ ముఖ కవళికలుండే వ్యోమ్‌ మిత్ర అనే హ్యూమనాయిడ్‌ను పంపిస్తామని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి: శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన 'విచిత్ర జీవి': వీడియో

మరిన్ని వార్తలు