State Wise Beggars: ఏ రాష్ట్రంలో బిచ్చగాళ్లు అధికం?

3 Oct, 2023 11:14 IST|Sakshi

ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో ఉపాధి మార్గాలు లేక వేలాది మంది అల్లాడిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే చాలామంది వీధుల్లో, ఇతర రద్దీ ప్రదేశాలలో భిక్షాటనకు దిగుతున్నారు. తద్వారా వారు రెండు పూటలా కడుపు నింపుకుంటున్నారు. భారతదేశంలో కూడా బిచ్చగాళ్ల సంఖ్య అత్యధికం. పలు నగరాల్లో సిగ్నల్స్‌ దగ్గర, మాల్స్‌ వెలుపల కూడా బిచ్చగాళ్లు కనిపిస్తారు అయితే దేశంలో ఎక్కువ మంది బిచ్చగాళ్లు ఏ రాష్ట్రంలో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

భారతదేశంలో సుమారు 4 లక్షల మంది భిక్షాటన చేస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. ఇవి ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు. వాస్తవంగా దీనిని మించిన సంఖ్యలో బిచ్చగాళ్లు ఉండవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం అత్యధికంగా యాచకులు కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రంలో బిచ్చగాళ్ల సంఖ్య 81 వేలకు పైగానే ఉన్నట్లు సమాచారం.

ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 4 లక్షల 13 వేల మంది యాచకులు ఉండగా, వీరిలో  రెండు లక్షల మందికి పైగా పురుషులు, దాదాపు రెండు లక్షల మంది మహిళలున్నారు. దీంతోపాటు చిన్నారులు కూడా యాచక వృత్తిలో కొనసాగుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 65 వేలకు పైగా యాచకులు ఉన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లు ఉన్నాయి. చండీగఢ్‌లో 121 మంది యాచకులు మాత్రమే ఉన్నారు.

దేశంలో అత్యల్పంగా బిచ్చగాళ్లు ఉన్న ప్రాంతం విషయానికొస్తే లక్షద్వీప్‌లో కేవలం ఇద్దరు బిచ్చగాళ్లు మాత్రమే ఉన్నారు. ఇది కాకుండా దాదర్ నగర్ హవేలీలో 19 మంది, డామన్-డయ్యూలో 22 మంది యాచకులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య ఖచ్చితమైమనది కాదు. ఎందుకంటే ప్రభుత్వం 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ఆధారంగా ఈ గణాంకాలను ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ఆంటీ ల్యాప్‌టాప్‌ ఇవ్వకపోతేనేం.. చిట్టితల్లి ఏం చేసిందో చూడండి!  

మరిన్ని వార్తలు