JEE Advanced 2022 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

11 Sep, 2022 12:43 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2022 ఫలితాలను పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ముంబై ఆదివారం ప్రకటించింది. ఫలితాలతోపాటే తుది ఆన్సర్‌ కీ, మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. విజయవాడకు చెందిన పొలిశెట్టి కార్తికేయ ఆరో ర్యాంకు సాధించింది. అభ్యర్థులు స్కోర్‌ కార్డులను jeeadv.ac.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫలితాలను రిజర్వేషన్లవారీగా ఆయా వర్గాల కోటా ప్రకారం విడుదల చేశారు.
రిజల్ట్‌ కోసం క్లిక్‌ చేయండి..

ఇక జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) సీట్ల కేటాయింపు కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. 12వ తేదీ నుంచి ‘జోసా’ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్టీఐలలో మెరిట్, రిజరేషన్ల ప్రాతిపదికన ప్రవేశాలు లభిస్తాయి. 23 ఐఐటీలలో 16,598 సీట్లు, 31 ఎన్‌ఐటీలలో 23,994, 26 ఐఐఐటీలలో 7,126, 33 జీఎఫ్టీఐలలో 6,759 సీట్లు ఈసారి భర్తీకి అందుబాటులో ఉన్నట్లు ‘జోసా’ సీట్ల వివరాలను విడుదల చేసింది.

వాటిలోనే మహిళలకు సూపర్‌ న్యూమరరీ కోటా కూడా అమలు కానుంది. ఐఐటీ­­లలో 1,567, ఎన్‌ఐటీలలో 749, ఐఐఐటీలలో 625, జీఎఫ్టీఐ­లలో 30 సీట్లు మహిళలకు సూపర్‌ న్యూమరరీ కోటా కింద రానున్నా­యి. ఆర్కిటెక్చర్‌ కోర్సులకు సంబంధించిన అభ్యర్థులు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టుకు 11, 12 తేదీల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 14న ఏఏటీ పరీక్షను నిర్వహించి 17న ఫలితాలను విడుదల చేయనున్నారు.

మరిన్ని వార్తలు