కస్టమర్ల కోసం ఎస్‌బీఐ సరికొత్త సేవ.. ఒక్క మెసేజ్‌ పెడితే చాలు..

11 Sep, 2022 13:00 IST|Sakshi

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) మరో సేవను తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఒక మెసేజ్‌తో ఫాస్టాగ్( FASTag) బ్యాలెన్స్‌ను చెక్ చేసుకునే సర్వీసును లాంచ్‌ చేసింది. దీని ద్వారా ఎస్‌బీఐ కస్టమర్లు ఫాస్టాగ్‌( FASTag) బ్యాలెన్స్‌ను సెకన్లలో తెలుసుకోగలుగుతారు. 

అందులో.. ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగించే ఎస్‌బీఐ కస్టమర్‌లు వారి రిజిస్టర్‌ అయిన నంబర్ నుంచి 7208820019కి ఎస్‌ఎంఎస్‌ (SMS) పంపడం ద్వారా వారి ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చని తెలిపింది. అయితే దీని కోసం ఎస్‌బీఐ కస్టమర్లు తమ మొబైల్ నెంబర్‌ను బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకుని ఉండాలి. టోల్ గేట్ల వద్ద వాహనదారుల సమయం వృథా కాకుండా..  వారి సేవింగ్స్ అకౌంట్ల నుంచే నేరుగా నగదు కట్టేలా కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ సర్వీసులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఇలా చేస్తే చాలు సెకనులో..
మీ వాహనంలో ఇన్‌స్టాల్ చేసిన ఫాస్టాగ్‌ బ్యాలెన్స్ వివరాలు.., మీరు FTBAL అని వ్రాసి 7208820019 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపాల్సి ఉంటుంది. అదే సమయంలో, మీకు చాలా వాహనాలు ఉంటే అప్పుడు మీరు FTBAL <వాహన సంఖ్య> అని వ్రాసి 7208820019కి పంపాలి.

చదవండి: టెక్నాలజీ అంటే ఇష్టం.. రూ.13వేల ఖర్చు, పాత ఇనుప సామగ్రితో బైక్‌!

మరిన్ని వార్తలు