కోర్టు తలుపుతడతాం!

18 Sep, 2020 17:21 IST|Sakshi

కర్ణాటక బీజేపీ చీఫ్‌ నళిన్‌ కుమార్‌ కతీల్‌

బెంగళూర్‌ : పబ్‌లు యువతను నాశనం చేస్తున్నాయని దక్షిణ కన్నడ జిల్లాలో పబ్‌లన్నింటినీ మూసివేయాలని కర్ణాటక బీజేపీ చీఫ్‌ నళిన్‌ కుమార్‌ కతీల్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో వీటిపై న్యాయపరమైన చర్యలు చేపట్టాలని తాను తమ పార్టీ యువజన విభాగాన్ని కోరతానని ఆయన స్పష్టం చేశారు. కతీల్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పబ్‌లు, క్లబ్‌లు యువతను నాశనం చేస్తున్నాయని దక్షిణ కన్నడ జిల్లాలో వీటిని మూసివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే న్యాయస్ధానాలను ఆశ్రయించాలని పార్టీ యువజన విభాగాన్ని కోరతానని చెప్పుకొచ్చారు.

కరోనా కట్టడికి విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం అన్‌లాక్‌ 4 మార్గదర్శకాలకు అనుగుణంగా కర్ణాటకలో బార్లు, రెస్టారెంట్లు తెరుచుకున్న నేపథ్యంలో కతీల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్‌ 1 నుంచి మద్యం విక్రయాలకు అనుమతించడంతో కర్ణాటకలోని పబ్‌లు, క్లబ్‌ల్లో మద్యం అమ్మకాలు విపరీతంగా సాగుతున్నాయి. ఇక 9366 తాజా కరోనా వైరస్‌ కేసులతో కర్ణాటకలో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,00,000కు చేరువైంది. ఇక మరణాల సంఖ్య 7629కి ఎగబాకింది. బెంగళూర్‌ నగరంలోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,84,082కు ఎగబాకింది. చదవండి : దొరికాడ్రా కొడుకు, ఉతుకుడే ఉతుకుడు!

మరిన్ని వార్తలు