Lakhimpur Kheri Case: యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. లఖీంపూర్‌ నిందితుడికి బెయిల్

10 Feb, 2022 16:26 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మొదటి దశ పోలింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన లఖీంపూర్‌ సింసాత్మక ఘటనలోని నిందితుడికి బెయిల్‌ లభించింది. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు, ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ గురువారం బెయిల్ మంజూరు చేసింది. గత అక్టోెబర్ 9న ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించి.. రిమాండ్‌కు తరలించారు. అయితే పలుమార్లు బెయిల్ నిరాకరించిన కోర్టు తాజాగా  బెయిల్ మంజూరు చేసింది
చదవండి: PM Modi Interview: ఎన్నికల వేళ.. లఖింపూర్ ఖేరి​ ఘటనపై ప్రధాని ఏమన్నారంటే..

కాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని లఖీంపూర్‌ ఖేరీలో 2021 అక్టోబర్‌ 3న ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా శాంతియుత నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌పైకి కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కాన్వాయ్ దూసుకుపోవ‌డంతో రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో.. దేశవ్యాప్తంగా రైతులు, పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో  సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. అయితే ఉద్ధేశ్య పూర్వకంగానే రైతులపైకి ఆశిశ్‌ మిశ్రా తన కారును పొనిచ్చాడ‌ని ఇటీవ‌లే క‌మిటీ పేర్కొంది. ఈ ఘటనకు బాధ్యతగా కేంద్రమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలంటూ ఇప్ప‌టికీ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు