India Bans Onion Export: ఉల్లి ఎగుమతులు నిషేధించిన భారత్.. కారణం ఇదే..

8 Dec, 2023 13:13 IST|Sakshi

దేశీయ మార్కెట్లో ఉల్లి ధరలు మళ్ళీ కొండెక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుదలవైపు దూసుకెళ్తున్న ఉల్లి ధరలు ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో హాఫ్ సెంచరీ (రూ. 50) దాటేశాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే సూచనలున్నట్లు భావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధరల పెరుగుదలను నియంత్రణలో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులను నిషేదించింది. దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్‌లను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) వెల్లడించింది. ప్రజలకు తక్కువ ధరలోనే ఉల్లి అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ ప్రకారం ఈ రోజు నుంచి (డిసెంబర్ 8) నిషేధం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎగుమతికి సిద్దమైన ఉల్లిని ఎగుమతి చేసుకోవచ్చని, కొత్తగా ఎగుమతి చేయడం కుదరదని డీజీఎఫ్‌టీ ప్రకటించింది. ఇతర దేశాల అభ్యర్థనలను భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆ దేశాలకు మాత్రమే ఉల్లి ఎగుమతి జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. లోన్ తీసుకున్న వారికి శుభవార్త

ఉల్లి ధరలను అదుపు చేయడానికి కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కేంద్రం అనేకసార్లు ఎగుమతులను నిషేదించింది. అయితే 2024 మార్చి 31 తరువాత ఎగుమతులు యధాతధంగా కొనసాగుతాయా? లేదా నిషేధం ఇంకా పొడిగించబడుతుందా అనేది తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు