ఒంటరి పురుషులకు శిశు సంరక్షణ సెలవులు

27 Oct, 2020 08:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ఒంటరిగా ఉంటున్న పురుష ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇకపై శిశు సంరక్షణ(చైల్డ్‌ కేర్‌) సెలవులు పొందవచ్చని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ తోమర్‌ సోమవారం చెప్పారు. అలాంటి వారిని సింగిల్‌ మేల్‌ పేరెంట్‌గా పరిగణిస్తామన్నారు. అవివాహితులు, భార్య మరణించిన వారు, విడాకులు తీసుకున్న వారు పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత ఉంటే ఈ సెలవులకు అర్హులని పేర్కొన్నారు. చైల్డ్‌ కేర్‌ లీవ్‌లో ఉన్నవారు లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌(ఎల్టీసీ) కూడా పొందవచ్చని సూచించారు. శిశు సంరక్షణ సెలవులో ఉన్నవారికి మొదటి 365 రోజులు పూర్తి వేతనం చెల్లిస్తారు. మరో 365 రోజులు కూడా ఈ సెలవులో ఉంటే 80 శాతం వేతనం చెల్లిస్తారు.

చదవండి: బీమా ప్రకటనల నిబంధనల్లో మార్పులు

మరిన్ని వార్తలు