బెంగాల్‌లో సంచలనం.. సీఎం మమతను టార్గెట్‌ చేశారా.. ఇనుప రాడుతో ఇంట్లోకి వెళ్లి.. 

12 Jul, 2022 14:59 IST|Sakshi

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని ఓ ఆగంతకుడు టార్గెట్‌ చేశాడు. మూడంచెల భ‌ద్ర‌త‌ను త‌ప్పించుకుని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఇంట్లోకి ప్ర‌వేశించడం బెంగాల్‌లో కలకలం సృష్టించింది. మమతా ఇంటి వద్ద అతను ఏడు సార్లు రెక్కీ నిర్వహించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

వివరాల ప్రకారం.. కోల్‌కత్తాలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న మమత ఇంటి వద్ద హ‌ఫీజుల్ మొల్లా అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడు. ఈ క్రమంలో మమతా బెనర్జీ కదలికపై ఫోకస్‌ పెట్టాడు. ఈ విషయాన్ని భద్రతా సిబ్బంది గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, విచారణలో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన సెల్ ఫోన్ తో మమత నివాసాన్ని ఫొటోలు తీశారని పోలీసులు తెలిపారు. 

కాగా, ఈ నెల 2, 3 తేదీల మధ్య రాత్రి హఫీజుల్.. సీఎం ఇంట్లోని భద్రతా సిబ్బందిని దాటి మమత ఇంట్లోకి ఇనుపరాడ్‌తో ప్రవేశించడాన్ని పోలీసులు గుర్తించారు. 11 సిమ్ కార్డులు క‌లిగి ఉన్న నిందితుడు బంగ్లాదేశ్‌, జార్ఖండ్‌, బీహార్‌కు చెందిన ప‌లువురికి ఫోన్ చేసిన‌ట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే నిందితుడు గ‌త ఏడాది స‌రైన ప‌త్రాలు లేకుండానే బంగ్లాదేశ్‌కు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న అనంత‌రం సీనియ‌ర్ పోలీస్ అధికారుల పోస్టింగ్‌ల్లో కోల్‌క‌తా అధికార యంత్రాంగం ప‌లు మార్పులు చేప‌ట్టింది. మమతా బెనర్జీ ఇంటి వద్దే ఉగ్రవాది ఇలా సంచరించడంతో సీఎం సెక్యూరిటీ డైరెక్టర్ వివేక్ సహాయ్‌ను పదవి నుంచి తొలగించారు. ఇక, నిందితుడు బంగ్లాదేశ్‌కు వెళ్లిన నేపథ్యంలో అక్కడ అతడి కార్యకలాపాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్ట పోలీసులు స్పష్టం​ చేశారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులతో హఫీజుల్‌కు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.

ఇది కూడా చదవండి: 'ఉదయ్‍పూర్ హత్య కేసు నిందితుడికి బీజేపీతో సంబంధాలు'.. సీఎం తీవ్ర ఆరోపణలు

మరిన్ని వార్తలు