ఎయిర్‌ లైన్స్‌ పై ఫిర్యాదులు... స్పందించిన సింధియా

13 May, 2022 21:08 IST|Sakshi

న్యూఢిల్లీ: స్పెస్‌ జెట్‌ బోర్డింగ్‌ పాస్‌ కోసం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయంటూ విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సింధియా ఫిర్యాదులను పరీశీలించేందుకు అంగికరీంచడమే కాకుండా త్వరితగతిన విచారణ చేస్తానని ట్వీట్‌ చేశారు. కొన్ని విమానయాన సంస్థలు వెబ్ చెక్-ఇన్ చేయాలని పట్టుబట్టడమే కాకుండా అలా చేయడంలో విఫలమైన ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ పలువురు సోషల్ మీడియా ఫిర్యాదులు చేశారు.

అంతేగాదు ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో బోర్డింగ్ పాస్ కోసం ప్రయత్నించే వారి నుంచి కొన్ని ఎయిర్‌లైన్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ చెక్-ఇన్ కౌంటర్‌లో చెక్ ఇన్ చేయడానికి ఒక్కో టికెట్‌కు రూ. 200 ఖర్చవుతుందని స్పైస్‌జెట్‌తో పాటు ఇండిగో కూడా అదే పని చేసిందని వెల్లడించారు. దీని వల్ల వినియోగ దారులకు చాలా అన్యాయం జరుగుతుందంటూ ఫిర్యాదులు చేశారు.

(చదవండి: ల్యాప్‌టాప్‌ కీబోర్డులో పట్టుబడ్డ రూ. 1.3 కోట్ల బంగారం)

మరిన్ని వార్తలు