Most Beautiful Village: దేశంలోని అందమైన గ్రామాలు.. ఎక్కడున్నాయంటే?​

17 Sep, 2023 11:03 IST|Sakshi

దేశంలోని పలు నగరాల తళుకుబెళుకులను మన  చూసేవుంటాం. కానీ దేశంలోని అత్యంత అందమైన గ్రామాలను చూసివుండం. ఇప్పుడు మన దేశంలోని అందమైన గ్రామాలను దర్శిద్దాం.

కల్ప (హిమాచల్‌ప్రదేశ్‌)
కల్ప.. సట్లెజ్ నది ఒడ్డున ఉన్న ఒక రహస్య గ్రామం. ఇది హైవే నుంచి అస్సలు కనిపించదు. అయితే ఈ గ్రామం అందం ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. గ్రామం చుట్టూ యాపిల్ తోటలు కనిపిస్తాయి. ఇక్కడ నుండి కైలాస పర్వత మంచు శిఖరాలు చూడవచ్చు. ఇక్కడ కనిపించినట్లు ఆ శిఖరాలు మరెక్కడా అంత స్పష్టంగా కనిపించవు.

మవ్లిన్నోంగ్ (మేఘాలయ) 
మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్‌లో ఉన్న మావ్లిన్నోంగ్.. ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామం. దీనిని దేవుడి తోట అని కూడా పిలుస్తారంటే దీని అందాలను అంచనా వేయవచ్చు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం ఉండదు. వెదురుతో చేసిన డస్ట్‌బిన్‌లను ఇక్కడ ఉపయోగిస్తారు.

ఖిమ్‌సర్ (రాజస్థాన్) 
చుట్టూ స్వచ్ఛమైన గాలి, ఇసుకతో కూడిన గ్రామం ఇది. ఊరి మధ్యలో సరస్సు కనిపిస్తుంది. గ్రామ సమీపంలో అందమైన చెట్లు ఉంటాయి. అందమైన గుడిసెలు కనువిందు చేస్తాయి. రాజస్థాన్‌లోని ఈ గ్రామాన్ని ఇసుక దిబ్బల గ్రామం అని కూడా అంటారు. ఈ గ్రామం అందమైన రిసార్ట్‌ను తలపిస్తుంది. ఇక్కడ దాదాపు 300 నుంచి 400 అడుగుల ఎత్తులోని భారీ మట్టి దిబ్బలు ఉన్నాయి.

పూవార్ (కేరళ) 
తిరువనంతపురానికి దక్షిణ తీరాన ఉన్న ఈ గ్రామం ప్రకృతి అందాలకు పెట్టిందిపేరు. ఇక్కడి పరిశుభ్రమైన, అందమైన బీచ్‌లు పర్యాటకులను  ఇంకొన్ని రోజుల ఇక్కడ గడిపేలా చేస్తాయి. అక్టోబర్- ఫిబ్రవరి మధ్య కాలం ఈ గ్రామాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం.

కొల్లెంగోడ్ (కేరళ)
పచ్చదనం, మామిడి తోటలకు ప్రసిద్ధి చెందిన ఈ చిన్న గ్రామం ఎంతో శుభ్రంగా ఉంటుంది. సంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించిన కొల్లెంగోడ్ ప్యాలెస్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. దీనిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు.

జిరాంగ్ (ఒడిశా) 
స్వచ్ఛమైన గ్రామీణ జీవితాన్ని చవిచూసేందుకు చంద్రగిరి ప్రసిద్ధి చెందిన గ్రామం. ఇక్కడి జిరాంగ్ లోయ, బౌద్ధ దేవాలయాలు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తాయి. ఈ గ్రామం పరిశుభ్రతకు పెట్టిందిపేరుగా నిలుస్తుంది.
ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది?

మరిన్ని వార్తలు