కుండల తయారీలో కామర్స్‌ గ్రాడ్యుయేట్‌..

5 Nov, 2023 11:54 IST|Sakshi

దీపావళి సమీపిస్తున్న కొద్దీ ఆ కాశ్మీరీ ముస్లిం కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ఆ కుటుంబం కొన్ని వారాలుగా మట్టి ప్రమిదలను తయారు చేయడంలో బిజీగా ఉంది. శ్రీనగర్‌లోని నిషాత్ ప్రాంతానికి చెందిన ఉమర్ తన కుటుంబ సభ్యులతో  కలిసి ప్రమిదలను తయారు చేస్తున్నారు.

ఈ దీపాలను విభిన్నమైన, ప్రత్యేకమైన శైలిలో ఉమర్ తయారు చేస్తున్నారు. ఉమర్ కుటుంబ సభ్యులు కశ్మీర్ లోయలోని సాంప్రదాయ మట్టి కళను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. గత ఏడాది దీపావళికి ఉమర్‌ 15 వేల దీపాలను తయారు చేశారు. ఈసారి ఉమర్‌ తమకు 20 వేలకు పైగా దీపాలకు ఆర్డర్లు వస్తాయని భావిస్తున్నారు. 

ఉమర్ ఇప్పటికే 4 వేలకు పైగా దీపాలను సిద్ధం చేశారు. ఇవి వివిధ రకాలు, వివిధ పరిమాణాలలో ఉన్నాయి. ఉమర్ కామర్స్ గ్రాడ్యుయేట్. ఉద్యోగం రాకపోవడంతో తండ్రితో కలిసి కుండలు తయారు చేయడం ప్రారంభించాడు. ఉమర్ మీడియాతో మాట్లాడుతూ దీపావళి సందర్భంగా తమకు ఉపాధి రూపంలో భారీ కానుక లభిస్తుందని తెలిపారు. దీపావళి రోజున ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఇది కూడా చదవండి: కాలుష్యం బారిన జూ జంతువులు.. ఉపశమనం కోసం ఏం చేస్తున్నారంటే.. 

మరిన్ని వార్తలు