PM Modi Temple: ప్రధాని మోదీకి ప్రత్యేక ఆలయం.. ఎక్కడో తెలుసా?

18 Aug, 2021 18:34 IST|Sakshi

ముంబై: బీజేపీ అగ్ర నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఓ ఆలయం నిర్మాణమైంది. ప్రధాని మోదీ అంటే ఓ బీజేపీ కార్యకర్తకు ఎంతో అభిమానం. ఆ అభిమానం కాస్త భక్తిగా మారింది. దీంతో తన అభిమాన నేతకు ఆలయం నిర్మించాడు. ప్రధాని మోదీ విగ్రహాన్ని నెలకొల్పి రోజూ పూజిస్తున్నాడు. ఆ ఆలయ వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని పుణెకు చెందిన 37 ఏళ్ల మయూర్‌ ముండేకు ప్రధాని మోదీపై ఎంతో అభిమానం పెంచుకున్నాడు.
(చదవండి: పసిపాప కోసం ‘ఒలింపిక్‌ మెడల్‌’ వేలానికి)

అభిమానాన్ని భక్తిగా మార్చుకున్న మయూర్‌ తాను నివసిస్తున్న అనుద్‌ ప్రాంతంలో రూ.లక్షన్నర ఖర్చుతో ఆలయాన్ని నిర్మించాడు. 6 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. అందులో ప్రధాని మోదీ విగ్రహాన్ని నెలకొల్పాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన ఈ ఆలయాన్ని మయూర్‌ ప్రారంభించాడు. ఈ ఆలయం స్థానికంగా సందర్శనీయ స్థలంగా మారింది.

ప్రజలు ఆసక్తిగా గమనిస్తుండగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మోదీ అభిమానులు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ఎర్రరాతిని జైపూర్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. విగ్రహ రక్షణ కోసం ప్రత్యేకంగా అద్దం ఏర్పాటుచేశారు. ఇక ఆలయం పక్కనే ఓ పెద్ద శిలాఫలకంలో మోదీ గురించి మయూర్‌ స్వయంగా రాసిన ఓ పద్యాన్ని రాసి ఉంచారు. ఈ ఆలయాన్ని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ (ఎన్‌సీపీ) తప్పుపట్టింది.

చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’

మరిన్ని వార్తలు