రంజిత్‌ స్ఫూర్తిగాథ.. నైట్‌వాచ్‌మెన్‌ నుంచి ఐఐఎం..

కాసర్‌గడ్‌: ఐఐఎం రాంచీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉన్న రంజిత్‌ రామచంద్రన్‌ది స్ఫూర్తిదాయక చరిత్ర. నైట్‌వాచ్‌మన్‌గా పనిచేసి, ఆ తరువాత ఐఐటీలో చదువుకుని, ప్రస్తుతం ఐఐఎం రాంచీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కి చేరారు. ఈ వివరాలను ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ఆయన వివరించారు. కూలిపోయే దశలో ఉన్న టార్పాలిన్‌తో కప్పిన తన చిన్న గుడిసె ఫొటోను కూడా అందులో పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌కు ఫేస్‌బుక్‌లో 37 వేల లైక్స్‌ వచ్చాయి. కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఇసాక్‌ కూడా రంజిత్‌కు అభినందనలు తెలిపారు.

కాసర్‌గడ్‌లోని పనతుర్‌లో ఉన్న ఒక టెలిఫోన్‌ ఎక్ఛ్సేంజ్‌లో రంజిత్‌ నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేశారు. అలా చేస్తూనే పీఎస్‌ కాలేజ్‌ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ఐఐటీ మద్రాస్‌లో సీటు సంపాదించారు. తనకు మలయాళం మాత్రమే తెలియడం, ఆంగ్లం రాకపోవడంతో అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి పీహెచ్‌డీ కోర్సు వదిలేద్దామనుకున్నారు. కానీ గైడ్‌ డాక్టర్‌ సుభాష్‌ సహకారంతో కోర్సు పూర్తి చేసి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరారు. పేదరికంతో పాఠశాల విద్యను మధ్యలోనే వదిలేశానని, తన తండ్రి టైలర్‌ కాగా, తల్లి ఉపాధి  కూలీ అని ఆ పోస్ట్‌లో రంజిత్‌ తెలిపారు. 

Author: కె. రామచంద్రమూర్తి
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు