అండమాన్‌లో 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు

21 Jan, 2023 20:58 IST|Sakshi

అండమాన్‌ నికోబార్‌ దీవులలోని 21 దీవులకు పరమ వీర చక్ర అవార్డు గ్రహిత పేర్లు పెట్టేందుకు శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. జనవరి 23న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. పైగా జనవరి 23న పరాక్రమ దివాస్‌గా పాటించనున్నట్లు పేర్కొంది. అంతేగాదు ఈ కార్యక్రమంలో నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ పేరుతో ఉన్న ద్వీపంలో నిర్మించనున్న జాతీయ స్మారక చిహ్నం నమునాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నట్లు తెలిపింది.

మోదీ 2018లో ఈ దీవులను సందర్శించి వాటి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని నేతాజీ స్మృతిని పురస్కరించుకుని అక్కడ ఉన్న రాస్‌ ఐలాండ్‌ దీవులకు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ద్వీప్‌ అని పేరు పెట్టారు. అలాగే నీల్‌ ఐస్‌లాండ్‌, హావ్‌లాక్‌ ఐస్‌లాండ్‌ వరుసగా నీల్‌ ద్వీప్‌, హావ్‌లాక్‌ ద్వీప్‌గా మారాయి. దేశంలో నిజ జీవితంలోని హిరోలకు సముచిత గౌరవం ఇవ్వడానికే ప్రధానమంత్రి ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ‍ప్రధాని కార్యాలయం పేర్కొంది.

ఈ స్ఫూర్తితోనే మందుకు వెళ్తూ.. ద్వీప సమూహంలోని 21 పేరులేని దీవులకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను పెట్టాలని నిర్ణయించారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడేందుకు తమ జీవితాలను త్యాగం చేసిన దేశవీరులకు ఇది శాశ్వత నివాళి అని పేర్కొంది. 

(చదవండి: వృద్ధుడిపై లాఠీ ఝళిపించిన మహిళా పోలీసులు)

>
మరిన్ని వార్తలు