చట్టసభల్లో ఓబీసీలకూ రిజర్వేషన్లు కల్పించాలి

22 Sep, 2023 05:06 IST|Sakshi

రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌

సాక్షి, న్యూఢిల్లీ : చట్టసభల్లో ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాగైతే  రిజర్వేషన్లు కల్పిస్తు న్నారో అదేవిధంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అందులో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదే శాల మేరకు మహిళా బిల్లుకు మద్దతిస్తు న్నామ న్నారు.

రాజ్యసభలో గురువారం మహిళ బిల్లు పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బిల్లు కార్యరూపం దాల్చిన ఏడేళ్ల తర్వాత అమలు చేయడం అంటే పంచభక్ష్య పరమాన్నం ముందుపెట్టి ఎప్పుడో తినమన్నట్లు ఉందన్నారు. సామాజిక, విద్య, ఆర్థిక అంశాల్లో వెనుకబాటు తనంతో ఉన్న ఓబీసీలకు రిజర్వే షన్లు ఎందుకు కల్పించరని బోస్‌ ప్రశ్నించారు. కేంద్ర ప్రభు త్వం దీనిపై ఆలోచించి త్వరలోనే ఓబీసీ బిల్లు తీసుకురావాలని ఎంపీ బోస్‌ విజ్ఞప్తి చేశారు.  

లింగ వివక్ష తగ్గుతుంది : ఆర్‌. కృష్ణయ్య
చర్చలో ఎంపీ ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. మహిళా బిల్లు స్వాగతించదగినదన్నారు. దేశంలో లింగ, కుల వివక్షలు ఉన్నాయని.. మహిళ బిల్లుతో లింగ వివక్ష తగ్గుతుందని.. అయితే, కుల వివక్ష తగ్గించాలంటే బిల్లులో ఓబీసీ సబ్‌కోటా పెట్టాలని కోరారు. సబ్‌కోటా కుదరకపోతే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. అన్ని రంగాల్లోనూ బీసీల పాత్ర చాలా తక్కువగానే ఉంటోందని కృష్ణయ్య తెలిపారు. రాజ్యాధికారం వస్తేనే వారికి గౌరవం దక్కుతుందన్నారు. 

మరిన్ని వార్తలు