బిహార్‌లో 65 శాతానికి రిజర్వేషన్లు

10 Nov, 2023 05:56 IST|Sakshi

ఆమోదించిన అసెంబ్లీ

పాట్నా: బిహార్‌లో ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో కుల రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. దీంతో, రాష్ట్రంలో అన్ని రిజర్వేషన్లు కలిపి 75శాతానికి చేరినట్లయింది. గురువారం అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం నితీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఆర్థికంగా బలహీన వర్గాలకు కేటాయించిన 10శాతం రిజర్వేషన్‌తో కలిపి ఇప్పుడు రిజర్వేషన్లు మొత్తమ్మీద 75 శాతానికి చేరుకున్నాయి’అని అన్నారు

. అంతకుముందు షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, అత్యంత వెనుకబడిన కులాలు(ఈబీసీలు), ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీల)కు ప్రస్తుతమున్న 50% రిజర్వేషన్లను 65%కి పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. సమగ్ర కులగణన ఆధారంగా విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.

మరిన్ని వార్తలు