Vedio: మిచౌంగ్ ధాటికి కుంగిన రోడ్డు

4 Dec, 2023 21:32 IST|Sakshi

చెన్నై: తమిళనాడులో మిచౌంగ్ తుపాను ప్రజలను వణికిస్తోంది. భారీ వర్షాలతో ముఖ్యంగా చెన్నై నగరం అతలాకుతలమవుతోంది.  ప్రధాన రహదారులన్నీ జలమయ మయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతాయం ఏర్పడింది. రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోవడంతో చెన్నై ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిపోయింది. దీంతో నగర వాసుల ఇబ్బందులు అన్ని ఇన్నీకావు. 

దక్షిణ చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఓ రహదారి కృంగిపోయింది. ఆ గుంటలోనే విద్యుత్ స్తంభం కూలిపోయింది. ఈ దృశ్యాలు చూపరులను భయభ్రాంతులకు గురిచేశాయి. పోయెస్ గార్డెన్ ప్రాంతంలోనే దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివసించేది.

చెన్నైలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముగ్గురు వ్యక్తులు మరణించారు. చెన్నైతో పాటు మరో మూడు జిల్లాల్లో రేపు ప్రభుత్వ సెలవు ప్రకటించారు. బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. అర్ధరాత్రి సమయంలో తుపాను నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణుల అంచనా.

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స..! కేంద్రం కీలక నిర్ణయం

>
మరిన్ని వార్తలు