మాట వినకపోతే.. సుప్రీం హెచ్చరిక

9 Feb, 2021 12:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషనర్‌ వాదనలు కొనసాగిస్తే భారీ జరిమానా విధిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు లోపించాయని ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది సీఆర్‌ జయ సుకిన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న , వి.రామస్రుబమణియన్‌లతో కూడినధర్మాసనం విచారించింది.

యూపీలో అనేక హత్యలు జరుగుతున్నాయని, కేంద్రం రాష్ట్రానికి ఎలాంటి సూచనలు చేయలేదని న్యాయవాది సుకిన్‌ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల క్రిమినల్‌ రికార్డులు కూడా పరిశీలించారా అని జస్టిస్‌ బోబ్డే ప్రశ్నించగా.. దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో 30 శాతం నేరాలు ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్నాయని సుకిన్‌ తెలిపారు. ‘ఇంతకు మించి ఎక్కువ వాదనలు కొనసాగిస్తే భారీ జరిమానా విధిస్తాం’అంటూ జస్టిస్‌ బోబ్డే పిటిషన్‌ను కొట్టివేశారు. 

చదవండి: ఉత్తరాఖండ్‌ : 12 మందిని కాపాడిన ఫోన్‌ కాల్‌

మరిన్ని వార్తలు