వృద్ధ బిచ్చగాడు కూడబెట్టుకున్న సోమ్ము వృధానేనా!

20 Oct, 2021 12:42 IST|Sakshi

చెన్నై: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016 నవంబర్‌ 16నలో డీ మానిటైజేషన్‌ ప్రవేశ పెట్టి రూ.500/-, రూ.1000/- నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగి అప్పుడే ఐదేళ్లు అయినా దీని గురించి కొంతమందికి ఇంకా తెలియదంటే ఆశ్చర్యంగా అనిపించక మానదు. ప్రస్తుతం ఈ విషయం గురించి తనకు ఏమి తెలియదంటున్నాడు తమిళనాడుకి చెందిన ఒక వృద్ధ బిచ్చగాడు.

(చదవండి: తలపాగే ప్రాణాలను కాపాడింది)

వివరాల్లోకెళ్లితే... తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన చిన్నక్కణ్ను అనే వృద్ధ బిచ్చగాడు తాను అడుక్కుంటూ జీవితాంతం పోదుపు చేసుకుంటూ కూడబెట్టిన సొమ్ము రూ.65,000 వృద్ధా అయిపోయిందంటూ ఆవేదన చెందాడు. తాను ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన డీమానిటైజేషన్‌ గురించి చెప్పులు కుట్టే కన్నయ్యన్‌ ద్వారా తెలుసుకున్నానని చెప్పాడు. దీంతో తాను దాచిని సోమ్మంతా పనికిరాదని అర్థమైందని, చివరిగా తన వద్ద మిగిలన డబ్బు కేవలం రూ 300/- మాత్రమే అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.

ఈ మేరకు చిన్నక్కణ్ను కలెక్టర్‌కు ఒక పిటిషన్‌ కూడా పెట్టుకున్నాడు. అంతేకాదు జిల్లా రెవెన్యూ అధికారి లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌కు ఈ పిటిషన్‌ను పంపించడమే కాక రిజర్వ్‌ బ్యాంక్‌ దృష్టికి కూడా తీసుకువెళ్తాం అని చిన్నక్కన్నకి హామీ కూడా ఇచ్చారు. అయితే నోట్ల మార్పిడి మార్చి 31, 2017తో ఆఖరు కాబట్టి కాబట్టి నోట్లు మారే అవకాశం ఉండదేమోనంటూ అదికారులు సందేహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జిల్లా యంత్రంగం చిన్నక్కణ్నుని ఆదుకోవడానికి ముందకు రావడమే కాక వృద్ధాప్య పెన్షన్‌ని కూడా ఏ‍ర్పాటు చేసింది.

(చదవండి: 'బీరు' బలి.. ఒక్కపనితో హీరో అయ్యాడు)

మరిన్ని వార్తలు