టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

23 May, 2022 16:48 IST|Sakshi

1..టెక్నాలజీ హబ్‌గా విశాఖపట్నం.. టెక్‌ మహీంద్రా సీఈవోతో సీఎం జగన్‌ చర్చలు


 స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు రెండో రోజు ఏపీ సీఎం జగన్‌ పలువురు ప్రముఖులతో వరుసగా సమావేశం అవుతున్నారు. రెండో రోజు ఉదయం సెషన్‌లో ఫ్యూచర్‌ ప్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్‌పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఆ తర్వాత దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌, టెక్‌ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీలతో  భేటీ అయ్యారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2..ఏపీలో ప్రతీ కుటుంబానికి ‘ఫ్యామిలీ డాక్టర్‌’ - డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో వైఎస్‌ జగన్‌


దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు (సోమవారం) ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ అంశంపై  మాట్లాడారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3..‘కొండలు, చెరువులన్నీ దోచుకున్నాడు.. నా స్పీడ్‌కు బ్రేక్ వేయడం ఎవరితరం కాదు’


జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ రేణుకా చౌదరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. సై అంటే సై అన్నట్లు ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రఘునాధపాలెం మండలం కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమంలో మంత్రి అజయ్‌పై మాజీ ఎంపీ రేణుకాచౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4..‘బీ కేర్‌ఫుల్‌’.. చైనాకు జో బైడెన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌


ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ డ్రాగన్‌ కంట్రీ చైనాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఒకవేళ తైవాన్‌ను చైనా ఆక్రమించుకోవాలని చూస్తే ‘ప్రమాదంతో ఆటలాడుకున్నట్టే’ అంటూ బైడెన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6.. MLC Anantha Babu Arrest News: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌


డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచనున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6.. నాన్నా! భయమేస్తోంది.. కన్నీరు పెట్టించిన విస్మయ కేసులో దోషిగా భర్త కిరణ్‌


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విస్మయ వరకట్న వేధింపుల హత్య కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్త కిరణ్‌ను దోషిగా ప్రకటించింది కొల్లాం న్యాయస్థానం. అంతేకాదు కీలక ఆధారం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. 22 ఏళ్ల విస్మయ అత్తింటి వేధింపులు భరించలేక.. తన ఇంటికి ఫోన్‌ చేసిన మాట్లాడిన ఆడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7.. IPL 2022: ‘టాప్‌-4’లోని ఒక్కడు తప్ప ఆ కెప్టెన్లంతా అదరగొట్టారు.. అగ్రస్థానం అతడిదే!


 ఐపీఎల్‌-2022 ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే లీగ్‌ దశ ముగియగా.. మే 24న తొలి క్వాలిఫైయర్‌-1 జరుగనుంది. ఆ తర్వాతి రోజు ఎలిమినేటర్‌ మ్యాచ్‌, మరుసటి రోజు క్వాలిఫైయర్‌ 2 మ్యాచ్‌ నిర్వహించనున్నారు. ఇక ఫైనల్ మే 29న జరుగననున్న విషయం తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8..Bindu Madhavi: సీక్రెట్‌ స్మోకింగ్‌పై స్పందించిన బిందుమాధవి


మొదట్లో బిగ్‌బాస్‌ షో అంటే కేవలం టీవీలకే పరిమితమయ్యేది. కానీ ఓటీటీలు వచ్చాక బిగ్‌బాస్‌ రూటు మారింది. గంట ఎపిసోడ్‌ మాత్రమే ఎందుకు చూపించాలి, హౌస్‌లో ఏం జరుగుతుందో ప్రత్యక్ష ప్రసారం చూపిస్తే పోలా అనుకున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9..Lower Petrol Prices States In India: పెట్రోల్‌ ధర రూ.100 కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలివే!


గత వారం కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించిన విషయం తెలిసిందే.పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో  పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర రూ.100 దిగువకు చేరింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10.. Healthy Heart Diet: 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే!


ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడటం, కొందరు ఆకస్మాత్తుగా మృత్యువాత పడటాన్నీ చూస్తున్నాం, వింటున్నాం. గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలంగా ఉంచుకోవాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు