చట్టం తనపని తాను చేసుకుపోతుంది: మంత్రి బొత్స

23 May, 2022 16:36 IST|Sakshi

సాక్షి, విజయనగరం: ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని.. 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనంతబాబు వ్యవహారంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు. కాగా, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసును పోలీసులు విచారిస్తున్నారు. విచారణ పూర్తికాగానే అనంతబాబును రిమాండ్‌కు తరలిస్తామని ఏఎస్పీ పేర్కొన్నారు. 19వ తేదీ రాత్రి సుబ్రహ్మణ్యం వెంట ఉన్న స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు.
చదవండి: కొండెక్కిన కోడి.. కిలో చికెన్‌ అం‍త ధరా?

మరిన్ని వార్తలు