Uttarakhand Tunnel Rescue: ఆ ఆటలన్నీ ఆడాం

1 Dec, 2023 15:18 IST|Sakshi
Photo courtesy : NDTV

న్యూఢిల్లీ : ఉత్తర కాశీ టన్నెల్‌ నుంచి బయటపడ్డ 41 మంది కార్మికులు ఒక్కొక్కటిగా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. టన్నెల్‌లో ఉన్న‍ప్పుడు వారు ఎలా టైమ్‌ గడిపారో చెప్తున్నారు. తాజాగా యూపీలోని మోతీపూర్‌కు చెందిన అంకిత్‌ టన్నెల్‌లో 17 రోజుల పాటు తాము చేసిన పనులకు సంబంధించి ఆసక్తికరర విషయాలు వెల్లడించారు. 

‘టన్నెల్‌లో గడిపిన 17 రోజులు టైమ్‌ పాస్‌ చేసేందుకు చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ ఆడాం. రాజా, మంత్రి, చోర్‌, సిపాయి లాంటి ఆటలు‌ ఆడుకున్నాం. టన్నెల్‌ చాలా పొడవుండడంతో ఎక్కువగా వాకింగ్‌ చేసే వాళ్లం. టన్నెల్‌లో పెద్దగా చలి లేదు. నిద్రపోవడానికి బ్లాంకెట్లు, జియో టెక్స్‌టైల్స్‌ వాడాం’అని అంకిత్‌ చెప్పాడు.

‘అయితే, టన్నెల్‌లో ఉన్న సమయంలో చావుకు దగ్గరగా వెళ్లొచ్చిన అనుభవం కలిగింది. కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారా అన్న కంగారుండేది. ఎందుకటే టన్నెల్‌లో నుంచి మేము వారితో మాట్లాడేంందుకు వీలు లేదు’అని అంకిత్‌ వివరించాడు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న చార్‌దామ్‌ ప్రాజెక్టు టన్నెల్‌ కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న 41 మంది కార్మికులు టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు. 17 రోజులు టన్నెల్‌లోనే ఉండిపోయిన కార్మికులను అతికష్టం మీద  బయటకు తీసుకొచ్చారు. 

ఇదీచదవండి..బెంగళూరులో పదుల సంఖ్యలో స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు

  

మరిన్ని వార్తలు