Teacher Dance Viral Video: ‘వావ్‌! ఎంత అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది.. తను టీచరేనా.. డ్యాన్సరా!’

18 Jun, 2022 14:56 IST|Sakshi

న్యూఢిల్లీ: స్కూల్‌ ఫంక్షన్లు, పార్టీల్లో విద్యార్థులు డ్యాన్స్‌ చేయడం సాధారణమే. అప్పుడప్పుడూ టీచర్లు కూడా సందర్భాన్ని బట్టి డ్యాన్స్‌ చేస్తుంటారు. అదే స్టూడెంట్స్‌, టీచర్లు కలిసి స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది. అది కూడా క్లాస్‌రూమ్‌లో చేస్తే భలే చూడ ముచ్చటగా ఉంటుంది కదూ. సరిగ్గా ఇలాంటి దృశ్యాలే ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో కనిపించాయి.  

మను గులాటి.. ఈ పేరు అందరికి కాకపోయినా కొంతమందికి గుర్తుండే ఉంటుంది. అదేనండి మన డ్యాన్స్‌ టీచర్‌. ఆ మధ్య ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్ధినితోపాటు డ్యాన్స్‌ చేసి సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయిన పంతులమ్మ. తాజాగా ఆమె మరోసారి ఉపాధ్యాయులు అంటే కేవలం విద్యను బోధించే వారు మాత్రమే కాదని నిరూపించారు. క్లాస్‌రూమ్‌లో పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించడమే కాకుండా వారితో కలిసి ఆనందంగా డ్యాన్స్‌ చేశారు. 

అది కూడా కిస్మత్ చిత్రంలోని ఎవర్‌గ్రీన్ పాట కజ్రా మొహబ్బత్ వాలా పాటకు ఎంతో పర్‌ఫెక్ట్‌ స్టెప్పులతో వావ్‌ అనిపించారు. విద్యార్థినిలందరూ ఒకలైన్‌లో నిల్చొని ఒకరి తరువాత ఒకరు స్టెప్పులతో అదరగొట్టారు. చివర్లో టీచర్‌, అమ్మాయిలు అంతా కలిసి చేయడం హైలెట్‌గా నిలిచిందని చెప్పవచ్చు. దీనిని సదరు టీచర్‌ ‘సమ్మర్‌ క్యాంప్‌లో చివరి రోజున మా అసంపూర్ణ నృత్యం. ఆనందం, కలయిక తోడైతే కొన్ని కచ్చితమైన స్టెప్పులకు దారితీస్తుంది’ అంటూ ట్విటర్‌లో షేర్‌ చేశారు.  
చదవండి: ట్రాఫిక్‌ ఏసీపీ మార్నింగ్‌ వాక్‌! మండిపోయిన జనం ఏం చేశారంటే..

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు మను గులాటి టీచర్‌ను పొగడ్తలతో ముంచేస్తున్నారు. నిజానికి ఆమె టీచర్‌ యేనా లేక ప్రొఫెషనల్‌ డ్యాన్సరా అనేలా నృత్యం చేశారని ప్రశంసిస్తున్నారు. కాగా ఢిల్లీ ప్రభుత్వ టీచర్ అయిన మను గులాటి  డ్యాన్స్‌లోనే విద్య చెప్పడంలోనూ మను మేడమ్‌ తోపే. ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. 2018లో కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి అందుకున్న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా అందుకున్నారు. 

మరిన్ని వార్తలు