పులికి చుక్కలు చూపించిన కోతి.. వీడియో వైరల్

26 Mar, 2021 16:25 IST|Sakshi

పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పులి కనుసన్నల్లో నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు. ఒకసారి టార్గెట్‌ చేసిందంటే వార్‌ వన్‌సైడ్‌ అవ్వాల్సిందే. ఒకవేళ అదృష్టం బాగుండి ఆ జంతువు పులికి చిక్కకుండా తప్పించుకుందంటే దాని ఆయుష్యు గట్టిదన్నట్లే. అయితే ఎక్కువగా పులి జింకను, ఇతర పెద్ద జంతువులను వెంటాడటం చూస్తుంటాం. కానీ ఇక్కడ చెప్పబోయే పులి కన్ను ఓ కోతిపై పడింది. దాన్ని ఆరోజుకీ ఆహారంగా చేసుకుందామనుకుంది. కానీ చివరిలో ఎవరూ ఊహించని ఓ ట్విస్ట్‌తో పులి కథ ముగిసింది.

విషయంలోకెళితే.. కోతి ఏంచక్కా చెట్టుమీద కూర్చొని ఉంది. దీనిని గమనించిన పులి చకచకా చెట్టుమీదకు ఎక్కిది. కోతిపై దాడి చేసేందుకు ప్లాన్‌ వేసింది. మెల్లమెల్లగా కోతి దగ్గరకు వెళ్లి దాని మీదకు దూకేందుకు సిద్ధపడింది. పులి అటాక్‌ చేసే సమయంలోకోతి వెంటనే పక్కన ఉన్న కొమ్మ మీదకు జంప్‌ చేసింది. దీంతో పులి ప్లాన్‌ బెడిసికొట్టడమే కాకుండా అదుపుతప్పి కిందపడిపోయింది. ఇంకేముంది అనుకుంటూ అక్కడినుంచి వెనుదిరిగి వెళ్లిపోయింది.

దీనికి సంబంధించిన వీడియోను భారత అటవీశాఖ అధికారి ప్రవీణ్‌ అంగూసామీ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘నీ బలహీనతలను ఎవరికీ చూపించకండి. నీ బలాన్ని నమ్ముకొని ధైర్యంగా నిలబడి ఎదుర్కొ’.. అంటూ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 10 వేల మందికి పైగా వీక్షించగా, నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెబుతున్నారు. కోతి ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. మరణం కొన్ని అంచుల దూరంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా తెలివిగా ఆలోచించే ధైర్యాన్ని పెంచుకోవాలంటూ పేర్కొంటున్నారు.

చదవండి: 
పులులు ఈదితే, మొసళ్లు ఒడ్డున సేద తీరుతాయి

మరిన్ని వార్తలు