దీదీ సంచలన నిర్ణయం.. పాతవారికే బాధ్యతలు

5 May, 2021 19:17 IST|Sakshi

బెంగాల్‌ డీజీపీ బదిలీ

కోల్‌కతా: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్‌ డీజీపీ నీరజ్‌ నయన్‌ను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాత డీజీపీ వీరేంద్రను తిరిగి బెంగాల్‌ డీజీపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్‌లో హింస చెలరేగింది అంటూ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

కాషాయ పార్టీ వ్యాఖ్యలపై దీదీ స్పందించారు. రాష్ట్రంలో చెలరేగిన హింసకు ఎన్నికల కమిషనే కారణమని ఆరోపించారు. ఇక మీదట రాష్ట్రంలో శాంతిభద్రతలను తానే పర్యవేక్షిస్తానని తెలిపారు. ఇక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిని ఘర్షణలకు సంబంధించి గవర్నర్‌​ డీజీపీని పిలిచి మాట్లాడారు. దీనిపై నివేదిక ఇవ్వాలని కోరారు. కేంద్ర హోం శాఖ కూడా దీనిపై నివేదిక కోరిన సంగతి తెలిసిందే.

కేంద్రానికి దీదీ లేఖ
సీఎం ప్రమాణం చేసిన అనంతరం మమతా బెనర్జీ తన తొలి ప్రాధాన్యత కోవిడ్‌ కట్టడే అని స్పష్టం చేశారు. ఈ మేరకు చర్యలు ప్రారంభించారు. రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్‌ పంపాలని కోరుతూ దీదీ కేంద్రానికి లేఖ రాశారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు