షాహీ ఈద్గా మసీదు సర్వేపై స్టేకు సుప్రీం నిరాకరణ

15 Dec, 2023 14:03 IST|Sakshi

లక్నో: కృష్ణ జన్మభూమి వివాదంలో షాహీ ఈద్గా మసీదు సర్వేను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో షాహీ ఈద్గా మసీదును సర్వే చేయడానికి అలహాబాద్ హైకోర్టు గురువారం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదాన్ని నిలిపివేయాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఉత్తరప్రదేశ్‌ మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్‌ ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల అడ్వకేట్ కమిషనర్‌ల బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది. ఇందుకు తగిన విధివిధానాలను డిసెంబర్ 18న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. 

మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరుపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్‌మాన్‌కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటీషన్లు దాఖలయ్యాయి.      

ఇదీ చదవండి: ప్లాన్ A&B.. పార్లమెంట్‌పై దాడిలో సంచలన విషయాలు

>
మరిన్ని వార్తలు