గూగుల్‌ మ్యాప్స్‌ మీ పెట్రోలును ఆదా చేస్తుందా?

15 Dec, 2023 12:35 IST|Sakshi

గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్‌ 

గూగుల్‌ మ్యాప్స్‌ ఉంటే ఎక్కడికైనా వెళ్లిరావొచ్చనే ధీమా ఉంటుంది. కొన్నిసార్లు కచ్చితమైన లోకేషన్లు చూపించకపోయినా.. మనం ఎంచుకున్న లోకేషన్‌ దగ్గరి వరకు వెళ్లేలా సహాయపడుతుంది. ఈ గూగుల్‌ మ్యాప్స్‌ను సుదూర ప్రాంతాలు, కొత్త ప్రాంతాలకు వెళుతున్నప్పుడు వెళ్లే రూట్‌తోపాటు వేగం తెలుసుకోవడానికి ఉపయోగిస్తూంటాం.

అయితే గూగుల్ మ్యాప్స్ ఇకమీదట ఫ్యూయల్ పొదుపు చేయడంలోనూ సహాయపడనుంది. ప్రయాణంలో ఫ్యుయల్ పొదుపు చేయడానికి గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ‘ఫ్యుయల్ ఎఫిషియంట్‌ రూట్స్‌’ అనే పేరుతో గూగుల్ యూజర్లకు ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు, కెనడాల్లో వినియోగంలో ఉన్న ఈ ఫీచర్ ఇక భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది.

ఈ గూగుల్ మ్యాప్స్ ఫ్యూయల్ సేవింగ్స్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే.. మనం వెళ్లే రూట్‌లో లైవ్ ట్రాఫిక్ అప్ డేట్స్‌, రహదారులు, ఇంధన సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. వాహన వేగం, ఫ్యుయల్ వాడకం రెండింటిని పరిగణనలోకి తీసుకుని అందుకు అనుకూల రూట్ చూపుతుంది. అలాగే ఆ రూట్‌లో వెళ్లడం వల్ల ఎంత ఫ్యుయల్ ఆదా అవుతుందో తెలుపుతుంది.

ఇలా సెట్‌ చేసుకోండి.. 

  • గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి.
  • ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘నేవిగేషన్ సెట్టింగ్స్’ ఎంచుకోవాలి.
  • కిందకు స్క్రోల్ చేస్తే అక్కడ కనిపించే ‘రూట్ ఆప్షన్’ అనే ట్యాబ్‌లో ‘ప్రిఫర్ ఫ్యుయల్ ఎఫిసెంట్ రూట్స్’ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి.
  • వాహనం ఇంజిన్, ఫ్యుయల్ టైప్‌ను ఎంచుకోవాలి.
  • నేవిగేషన్ ట్యాబ్ లోనే టోల్ ధర, స్పీడో మీటర్ వంటి ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
  • వాహన వేగంతోపాటు మీరు వెళ్లే రూట్‌లో ఎంత టోల్ ఫీజు పే చేయాలో ఈ ఫీచర్ చెబుతుంది.

ఇదీ చదవండి: వేలకోట్ల అప్పు తీర్చే యోచనలో అదానీ గ్రూప్.. ఎలాగంటే..

>
మరిన్ని వార్తలు