Janmashtami: ప్రముఖ ఆలయాల్లో జన్మాష్టమి వేడుకలు.

7 Sep, 2023 12:59 IST|Sakshi

మధుర, బృందావనం మొదలుకొని దేశవ్యాప్తంగా నేటి ఉదయం నుంచి పలు ఆలయాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుని విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. శ్రీహరి అవతారాల్లో ఇది సంపూర్ణమైనదని చెబుతారు. 

ఈ సారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రెండు రోజులు నిర్వహిస్తున్నారు. కొందరు సెప్టెంబరు 6న జన్మాష్టమి వేడుకలు చేసుకోగా, మరికొందరు నేడు (సెప్టెంబరు 7)న ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపద్యంలో ఆలయాలన్నీ ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. 
 

శ్రీకృష్ణ జన్మభూమి మధురలో ఉదయం స్వామివారికి మంగళహారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆ సమయంలో ఆలయంలో శంఖనాదాలు చేశారు. ఆలయంలో కొలువైన రాధాకృష్ణులకు పసుపురంగు దుస్తులు ధరింపజేశారు. అలాగే పూలతో అలంకరించారు. 
 

పశ్చిమబెంగాల్‌లోని ఇస్కాన్‌ ఆలయంలో ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో పూజలు, అర్చనలు విశేషరీతిలో జరిగాయి. కొందరు భక్తుల భగవానుని సమక్షంలో నృత్యాలు చేశారు. కొందరు శంఖనాదాలు చేశారు. 
 

ఉత్తరాఖండ్‌లోని బదరీనాథ్‌ ఆలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. జన్మాష్టమి సందర్భంగా ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. ఆలయాన్ని ఎల్‌ఈడీ వెలుగులతో నింపేశారు. 
 

ఢిల్లీలోని ఇస్కాన్‌ మందిరంలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం స్వామివారికి తులసి హారతి సమర్పించారు. ఆలయ పూజారులు, భక్తులు సంయుక్తంగా హారతి అందించారు. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. 
 

మరిన్ని వార్తలు