Mizoram Election Results 2023: సీఎం జోరంతంగాపై విజయ ఢంకా

4 Dec, 2023 16:46 IST|Sakshi

ఐజ్వాల్‌: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్‌ పీపుల్స్ మూమెంట్‌(జెడ్‌పీఎమ్‌) పార్టీ ఘన విజయం సాధించింది. 27 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఈ ఎన్నికల్లో జెడ్‌పీఎమ్‌ పార్టీ తరపున ఐజ్వాల్‌ ఈస్ట్-1 నియోజకవర్గం నుంచి గెలిచిన లాల్‌తన్‌సంగా వార్తల్లో నిలిచారు. మూడుసార్లు మిజోరం ముఖ్యమంత్రిగా చేసిన జోరంతంగాను ఓడించి 2 వేల ఓట్ల మెజారిటీతో లాల్‌ గెలిచారు. 

ఈ సందర్భంగా లాల్‌తన్‌సంగా మాట్లాడుతూ ‘మిజోనేషనల్‌ ఫ్రంట్‌(ఎమ్‌ఎన్‌ఎఫ్‌), కాంగ్రెస్‌ పార్టీలది కేవలం అధికారదాహం. పార్టీ నాకు ఐజ్వాల్‌ ఈస్ట్‌-1 టికెట్‌ ఇచ్చినపుడు నేను సర్వే చేసుకున్నాను. నియోజకవర్గంలో జోరంతంగా బలం అంతగా లేదని నాకు అప్పుడే తెలిసింది. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా జోరంతంగా నాయకత్వంపై ప్రజలు అంత సంతృప్తిగా లేరు’అని లాల్‌ తెలిపారు.  

‘కాంగ్రెస్‌, ఎమ్‌ఎన్‌ఎఫ్‌​ పార్టీలు కేవలం డబ్బుపైనే ఆధారపడి రాజకీయాలు చేస్తాయి.నిజంగా డబ్బు ప్రభావమే ఉంటే జోరంపై నేను గెలిచేవాడిని కాదు’అని లాల్‌ చెప్పారు. సోమవారం ప్రకటించిన  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మిజోరంలో జెడ్‌పీఎమ్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. మిజోరం అసెంబ్లీలో మొత్తం 40 సీట్లుండగా జెడ్‌పీఎమ్‌ 27 సీట్లు గెలిచింది.

ఇవీ చూడండి..మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ అప్‌డేట్స్‌     

>
మరిన్ని వార్తలు