Sakshi News home page

ఇలా చేస్తే మీ ఇల్లు విశాలంగా, కాంతివంతంగా కనిపిస్తుంది

Published Mon, Dec 4 2023 4:48 PM

Winter Decorations To Make Your Home Super Cozy This Season - Sakshi

చలికాలం పొద్దు తగ్గుతుంది. వాతావరణం డల్‌గా మారుతుంది. ఆ దిగులు ఇంటికీ చేరుతుంది. ఇంట్లో వాళ్ల ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. సో.. కాలాన్ని బట్టి దుస్తులే కాదు ఇంటి అలంకరణనూ మార్చాలి.. హుషారురేకెత్తించేలా.. ఇలా..

చీకటి మూలలను బ్రైట్‌ చేసేయాలి. అందుకు ఫ్లోర్‌ ల్యాంప్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఉల్లాసం.. ఉత్సాహం కోసం ఇండోర్‌ మొక్కల అలంకరణ తప్పనిసరి.


అల్లికలతో ఉన్న బెడ్‌షీట్స్, దిండు కవర్లు శీతాకాలాన్ని బ్రైట్‌గా మార్చేస్తాయి. అలాగే వెచ్చదనం కావాలన్నా.. విలాసంగా కనిపించాలన్నా.. వెల్వెట్‌ క్లాత్స్, సాఫ్ట్‌  ఫర్‌ ఉండే పిల్లోస్‌ బాగా ఉపయోగపడతాయి.


సహజమైన కాంతి కోసం.. ఖాళీగా ఉన్న గోడపైన పెద్ద నిలువుటద్దాన్ని వేలాడదీయాలి. ఫ్రేమ్‌కి ఆకట్టుకునే రంగును వేయడం ద్వారా అద్దాన్ని అందంగా మార్చేయవచ్చు. దీని వల్ల ఇల్లు విశాలంగా, కాంతిమతంగానూ కనిపిస్తుంది. 


వింటర్‌ ఫ్యాషన్‌లాగానే వింటర్‌ హోమ్‌ డెకరేటింగ్‌ని ఫాలో అవ్వాల్సిందే. కుర్చీలను స్లిప్‌ కవర్లతో కవర్‌ చేయడం ద్వారా డైనింగ్‌ రూమ్‌కి వెచ్చదనాన్ని తీసుకురావచ్చు.
విండోస్‌కి మందపాటి కర్టెన్లు వేసి, షీర్‌ డ్రేపరీలతో భర్తీ చేయవచ్చు. దీని వల్ల ఉష్ణోగ్రతలు పడిపోయినా వెచ్చదనం ఉంటుంది.


  శీతాకాలపు సువాసనల్లో సుగంధ ద్రవ్యాల పాత్ర అమోఘం. ముఖ్యంగా దాల్చిన చెక్క సువాసన వింటర్‌ని ఉత్సాహంగా మారుస్తుంది. సుగంధ పరిమళాల డ్రై ఫ్లవర్‌ బాస్కెట్‌ని అమర్చుకోవచ్చు. సెంటెడ్‌ క్యాండిల్స్‌ కూడా ఉల్లాసంగా ఉంచుతాయి.

Advertisement

What’s your opinion

Advertisement